ఇళయరాజా పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంగీతానికి సంబంధించిన 536 వర్క్స్ అంశంలో ఇళయరాజా కాపీరైట్ కేసు వేశారు. అయితే బాంబే హైకోర్టులో ఉన్న ఆ కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. ఆ పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను డిస్మిస్ చేసింది.మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సుమారు 1500 చిత్రాలకు 7500 పాటలు కంపోజ్ చేశారు. అయితే ఇళయరాజాకు చెందిన మ్యూజిక్ ఎన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ వద్ద ఉన్న 536 పాటలను అక్రమంగా వాడుకుంటున్నట్లు సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్మెంట్ ఇండియా సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో 2022లో బాంబే హైకోర్టు కేసు దాఖలు చేసింది. ఆ 536 పాటలను ఓరియంటల్ రికార్డ్స్ ఎకో రికార్డింగ్ నుంచి తీసుకున్న సోనీ కంపెనీ చెప్పింది. అయితే ఆ మ్యూజిక్ వర్క్స్ విషయంలో కేసు దాఖలు చేసిన ఇళయరాజా.. పిటీషన్‌ను మద్రాసు హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. సోనీ సంస్థ క్లెయిమ్ చేస్తున్న 536 పాటల్లో 310 పాటలపై మద్రాసు హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు.
About The Author

Related Posts
